schedule Friday, September 04, 2026

చర్చకు ఎక్కడైనా సిద్ధం.. ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరాధారం

calendar_today September 4, 2026
person Prajagalam News
చర్చకు ఎక్కడైనా సిద్ధం.. ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరాధారం
   

• అవినీతి ఆరోపణలపై ఆధారాలతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం

• మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి

• కాంగ్రెస్ పార్టీ నాయకులు

(తాండూరు) ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్     షేక్ ఖాసిం,  మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ ఎల్లప్ప తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ కక్షతో కూడుకున్నవని ఆమె ఆరోపించారు. “అవినీతి గురించి మాట్లాడుతున్న వారు ముందుగా తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలని నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆధారాలతో వస్తే ప్రజాక్షేత్రంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం” అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.“వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారో ప్రజలకు తెలుసు.గత పదేళ్ల పాలనలో ఏం జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. అభివృద్ధి విషయంలో మాతో చర్చకు రావాలి. ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజల ముందే తేల్చుకుందాం” అని నీరజ బాల్ రెడ్డి అన్నారు.తాను గతంలో బీఆర్ఎస్‌లో పదేళ్ల పాటు పనిచేసినప్పటికీ తనకు తగిన ప్రాధాన్యత, గౌరవం లభించలేదని నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో తనకు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కల్పించి గౌరవించిందన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ  ఏ అంశంపై అయినా ఆధారాలతో మాట్లాడితే తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.తాండూరు ప్రజలకు ప్యాకేజీల మనిషి ఎవరో తెలుసని డ్రక్స్ మాఫియా అంటే ఎవరో తెలుసని అన్నారు.మాజీ ఎమ్మెల్యే  డ్రక్స్ కేసులో అడ్డంగా పట్టు బడి జైలు జీవితం అనుభవించి ఈ రోజు ప్రజల్లో తిరుగుతుండని పేర్కొన్నారు.మీ మాజీ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు కోర్టులలో ఉన్నాయని మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  పై అనుచిత వాక్యాలు చేస్తే సహించమని అన్నారు. నిన్న ప్రెస్‌మీట్ పెట్టారు.. మాటలు చెప్పారు… కానీ ఆధారాలు ఎక్కడున్నాయి.?24 ఎకరాలు అన్నారు CBI కేసు అన్నారు హైకోర్టు స్టే అన్నారు. 33 ఎకరాల ప్రభుత్వ భూమి అన్నారు.250 ఎకరాలు అన్నారు. DCCB అవినీతి అన్నారు.మరి వాటిని నిరూపించే ఆధారాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.మనోహర్ రెడ్డి  లేదా JB అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించిన అధికారిక ఉత్తర్వులు ఉంటే అవి కూడా ప్రజల ముందు పెట్టాలని అన్నారు.హైకోర్టు స్టే అంటున్నారు. స్టే వచ్చిన విషయం చెప్పారు. మరి ఆ స్టే తర్వాత వెకేట్ అయిందన్న విషయం ఎందుకు చెప్పలేదు? పాత ఆర్డర్ గురించి మాత్రమే చెప్పి, తర్వాత వచ్చిన ఆర్డర్స్ ను దాచిపెట్టి ప్రజలకు సగం సమాచారం ఎందుకు ఇస్తున్నారని అన్నారు.ప్రస్తుతం అమల్లో ఉన్న హై కోర్టు స్టేను ప్రజల ముందు పెట్టండని సవాల్ విసిరారు. ఇక డిసిసిబి గురించి చేసిన ఆరోపణలు మరీ విచిత్రమని చైర్మన్ ఇండివిడ్యుల్ సొసైటీ నిర్వహించే టెండర్ ప్రాసెస్కు సంబంధం ఏంటో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశారు.మాజీ ఎమ్మెల్యే  తాండూర్ మండలం సిరిగిర్ పేట్ భూ కబ్జాలు, విద్యావికాస్ ట్రస్ట్ భూముల వ్యావహారం, వ్యాపారాలను బెదిరించి ప్లాట్స్ కబ్జాలు, వసూలు ఇవ్వన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు.టైమ్, డేట్ ఫిక్స్ చేయండి. తప్పకుండా వస్తామని పేర్కొన్నారు.