యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు జరగాలి
September 4, 2026
Prajagalam News
⇒ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Vikarabad-: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన నాణ్యత తో నిర్ణత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజజవర్గంలోని హకీంపేటలొ కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పనుల పై రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.జులై 21న నిర్వహించిన సమీక్ష సందర్బంగా ఆయా శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటి వరకు పూర్తి చేసిన లక్ష్యాల పై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు హకీంపేటలొ 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇరిగేషన్, హెచ్ఎండిఏ (రేడియల్ రోడ్డు ), టి జి ఐ ఐ సి (ఇండస్ట్రియల్ ఎస్టేట్), ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, టీజీ డబ్ల్యూ ఐ డి సి, ఆర్ టి సి, హౌసింగ్, వ్యవసాయము మరియు ఉద్యాన శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పర్యాటక శాఖల పై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ముందుగా ఇరిగేషన్ శాఖ పై సమీక్ష నిర్వహించారు.
- మాక్తల్, నారాయణపేట, కొడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు సంబంబదించి ఫేజ్ 1,2,3 కలిపి సమాంతరంగ పనులు నిర్వహించాలని ఎట్టి పరిస్థితిలోను ఆలస్యానికి తావు ఇవ్వొద్దని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏ నెలకు ఆ నెల లక్ష్యాలు నిర్దేశించుకొని పూర్తి చేయాలి. నిధులు లేని కారణంగా పనులు ఆగిపోయాయని వినపడవద్దని, నిధులు ఎప్పటికప్పుడు విడుదల అయ్యేవిధగా చూడాలని ఆర్ధిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు. భూసేకరణ పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరిగేవిధంగా చూడాలన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ సామథ్యం పెంచాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించడం జరిగిందని, దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఫెజ్ 2 కు సంబంధించి గ్రావిటి కేనాల్ పనులకు త్వరగా టెండర్ పిలవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మూడు ఫెజ్ లకు కలిపి 1053 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఏమయినా ఇబ్బందులు వస్తే వెంటనే తన దృష్టికి తీసురావాలని సూచించారు.
- - హెచ్. యం. డి. ఎ రేడియల్ రోడ్డు పై సమీక్షలు
- నియోజకవర్గంలోని ఏ ఒక్క తాండాకు రోడ్డు లేదని ఫిర్యాదు రాకూడదని ప్రతి తాండాకు రోడ్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 2027 లోగ నియోజకవర్గంలో అన్ని రోడ్లు పూర్తి కావాలని ఆదేశించారు. దౌల్తాబాద్ అంబేద్కర్ విగ్రహం నుండి చంద్రవంచ గుండా మహబూబ్ నగర్ చించొలి అలిపే రోడ్డును విస్తరించి డబుల్ రోడ్డు చేయాలని ఆదేశించారు. వాగుల మీద నాన్యమైన వంతెనలు నిర్మించాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ పై సమీక్ష నిర్వహిస్తూ మున్సిపాలిటీల్లో అక్కడక్కడా తవ్వేసి వదిలిపెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా జరుగకుండా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని,కొడంగల్ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం పనులు సకాలంలో పూర్తి చేయాలని అదేవిధంగా రోడ్డువిస్తరణ పనులు సైతం నిర్ణత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్ 2.0 కింద తాగు నీరు పనులు త్వరగ పూర్తి చేయాలి. మద్దూరు మున్సిపాలిటీ లొ రోడ్డు విస్తరణ, డ్రైన్ పనులు నిర్ణిత గడువులో పూర్తి చేయాలి. కొడంగల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటి పరిధిలో మౌలిక వసతులు నాణ్యత తో గడువుగా పూర్తి చేయాలన్నారు. పోతిరెడ్డి నుండి సంపల్లి వరకు రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి.తాండూరు శాసన సభ్యులు బి. మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, నారాయణపేట కలెక్టర్ ప్రియాంక, ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఆయా శాఖలా ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.