కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల సత్యనారాయణ రెడ్డి
September 4, 2026
Prajagalam News
Vikarabad:-
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నూతన అధ్యక్షుడిగా కొప్పుల సత్యనారాయణ రెడ్డిని నియమించారు.గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు వికారాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కొప్పుల సత్యనారాయణరెడ్డి,పెద్దపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కట్కూరి సత్యనారాయణను నియమించారు.ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొప్పుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని,రైతుల కోసం నిరంతరం పాటు పడతామని అన్నారు.తన పై నమ్మకంతో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు రాం చందర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.