మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యం... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
March 24, 2026
Prajagalam News
* అసెంబ్లీలో గలమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్ : తాండూర్ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూర్ సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా మెరుగైన రహదారులతోనే అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందన్న దృఢ నమ్మకంతో, వ్యాపార వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన తాండూర్ ప్రాంతం భవిష్యత్తులో విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కలగాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరం నుంచే తాండూర్ నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సంబంధిత మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తూ,ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా తాండూర్ రోడ్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు మరియు అధికారుల దృష్టికి సమస్యలను ఎప్పటికప్పుడు తీసుకెళ్లడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రస్తావిస్తూ గతంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ నిర్మాణ సమయంలో ఆర్&బీ,విద్యుత్ శాఖ,మిషన్ భగీరథ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమస్యలను పరిష్కరించాలని ప్రజలను కోరారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన రహదారుల నిర్మాణం జరుగుతుందని అన్నారు. తాండూర్ – కోట్‌పల్లి ప్రధాన రహదారి, తాండూర్ – తట్టేపల్లి, తొర్మమామిడి రహదారి, మరేపల్లి –మదనంతపూర్ రహదారి, బుద్దారం నాగులపల్లి రహదారి, లక్ష్మీనారాయణపూర్ – దేవనూర్ రహదారి, కోకట్ బ్రిడ్జి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించామని సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వచ్చే నెలలో పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.