schedule Friday, September 04, 2026

మొండి బకాయిదారులపై బల్దియా చర్యలు

calendar_today March 23, 2026
person Prajagalam News
    పలు దుకాణాలను సీజ్ చేసిన అధికారులు తాండూర్: మున్సిపాలిటీ పరిధిలోని మొండి బకాయిదారులపై కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. రెడ్ నోటీసు జారీ చేయడంతో పాటు పలు దుకాణాలను కమిషనర్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలు ఉన్న బకాయిదారుల దుకాణాలను సీజ్ చేసినట్లు తెలిపారు. పోట్లీ మహారాజ్ దేవాలయానికి సంబంధించి షాపులను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు . పలు దుకాణాలు,ప్రైవేటు ప్రాపర్టీలకు సంబంధించి మొండి బకాయిల దారులకు రెడ్ నోటీసులు అందిస్తూ కట్టకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పన్నులు చెల్లించకపోతే మున్సిపాలిటీ గ్రాంట్లు నిలిచిపోయే అవకాశం ఉందని పట్టణ ప్రజలు పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కమిషనర్ వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్ ఐ రాములు,బిల్ కలెక్టర్ నాగేందర్, కపిల్, గోపాల్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్, జవాన్లు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.