schedule Friday, September 04, 2026

రామనామం..రమ్యమైనది

calendar_today March 23, 2026
person Prajagalam News
భక్తి శ్రద్ధలతో.మూలావిరాట్ల ఊరేగింపు. తాండూరు..రాములోరి ఆలయ పునఃనిర్మాణంలో బాగంగామొదటి రోజు భక్తి శ్రద్ధలతో మూలావిరాట్ల ఊరేగింపు నిర్వహించారు. సోమవారం తాండూరు పట్టణంలోని శ్రీభావిగి భద్రేశ్వర ఆలయంనుండి మూలావిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు ప్రారంబించారు. మూలావిరాట్ల ఊరేగింపు పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా భజనలు,సంకీర్తనలు జైశ్రీరాం... జై జై శ్రీరాం అంటూ రామనామం తలుస్తూ ఊరేగింపు కొనసాగించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రామనామస్మరణతో తాండూరు పట్టణం మార్మోగింది