వికారాబాద్ జిల్లాలో బిజేపి బలోపేతానికి సమన్వయంతో పని చేయాలి:- బిజేపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు
August 10, 2026
Prajagalam News

(ప్రజాగళం,వికారాబాద్)
వికారాబాద్ జిల్లాలో బిజేపి బలోపేతానికి సమన్వయంతో పని చేయాలని బిజేపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన యు. రమేష్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ సందర్బంగా శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలో, పోలింగ్ బూత్ స్థాయిలో బిజెపిని అత్యంత శక్తివంతంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు అందరూ విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా, కలిసికట్టుగా పార్టీ విజయే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉంటూ పోరాటాలు ఉధృతం చేయాలని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు... బిజెపి రాష్ట్ర నాయకులు కరణం ప్రహ్లాద రావు,బిజెపి రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్ప,మాజీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, వనపర్తి జిల్లా ఇంచార్జ్ గిరమోని శ్రీనివాస్,బీజేపీ నాయకులు మారుతి కిరణ్, శివరాజు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి, శంకర్ నాయక్, వికారాబాద్ జిల్లా, పరిగి, వికారాబాద్, తాండూర్ నియోజకవర్గ బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.