ఆషాడ మాసంలో ఘనంగా శ్రీ పోచమ్మ,శ్రీ రేణుక ఎల్లమ్మ,శ్రీ మైసమ్మ గ్రామ దేవతలకు బోనాల సమర్పించిన గ్రామస్తులు
August 2, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఆషాడ మాసంలో ఆదివారం నాడు ఘనంగా శ్రీ పోచమ్మ,శ్రీ రేణుక ఎల్లమ్మ,శ్రీ మైసమ్మ దేవతలకు గ్రామ ప్రజలు బోనాలు,దీప,దూప, నైవేద్యాలతో మొక్కులు చెల్లించారు.ఈ సందర్భంలో బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ మాట్లాడుతూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని,గ్రామ ప్రజలు ఆషాడమాసంలో డప్పుల దరువులతో మొక్కులు చెల్లించుకున్నారని,గ్రామ ప్రజలను పిల్లాపాపల్ని చల్లగా చూడాలని,వర్షాలు బాగా కురిసి పాడి,పశువులతో సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామంలో వెలసిన దేవతలను వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్,మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోహిత్ మహారాజ్,సాయిలు గౌడ్,పవన్ ఠాకూర్,సిద్ధార్థ,వీరేశం, రాము నాయక్, తదితరులు పాల్గొన్నారు.