schedule Friday, September 04, 2026

రోడ్డు భద్రత నిబంధనలు తప్పని సరిగా పాటించాలి

calendar_today March 21, 2026
person Prajagalam News
రోడ్డు భద్రత నిబంధనలు తప్పని సరిగా పాటించాలి
కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కూమార్
  • వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల) వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ అన్నారు. శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలోని వివేకానంద చౌరస్తాలో గ్రామస్థులు వాహనదారులకు వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.అదే విధంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామస్థులు యువకులు పాల్గొన్నారు.