
తాండూరు: మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.రంజాన్ పర్వదినం సందర్బంగా చెన్ గెస్ పూర్ రోడ్డు మార్గంలో ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తో మరియు ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకుంటూ "ఈద్ ముబారక్" అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తాండూర్ పట్టణంలో గల ఖబరస్తాన్ లకు, మజీద్ లకు,దర్గాల అభివృద్ధి కోసం దాదాపు 85 లక్షల రూ, నిధులు కేటాయించడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. రంజాన్ అంటే సోదర భావానికి ప్రతీక అని భక్తిశ్రద్ధలతో నెలవారి ఉపవాస దీక్షలకు ముగింపు రంజాన్ పండుగని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ వేడుకలలో సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, సీనియర్ నాయకులు అబ్దుల్ రాహుఫ్, నయీమ్ అప్పు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కరణం పురుషోత్తం రావు, ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ లు బంటు వేణు, శ్రీకాంత్, రాము, మల్లేశం, రాజు గౌడ్, బాలకృష్ణా రెడ్డి, జుంటుపల్లి వెంకట్, ఈద్గా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, సదర్ ఫసియుద్దీన్ ట్రెజరర్ కైసర్, జుబేర్ లాల, మోసిన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, పర్వేజ్ర్, జిలాని, కాంగ్రెస్ నాయకులు,బంటు మల్లప్ప, అనిల్, అంకిత్, బిర్కట్ రఘు తదితరులు పాల్గొన్నారు..