schedule Wednesday, September 02, 2026

బిఎస్ఆర్ ను కలిసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

calendar_today July 18, 2026
person Prajagalam News
బిఎస్ఆర్ ను కలిసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

• తాండూరు పారిశ్రామిక ప్రగతిపై కీలక మంతనాలు.

(తాండూర్) తాండూర్ లో మంత్రుల పర్యటన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నిమిత్తం తాండూరు పర్యటనకు విచ్చేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ప్రముఖ సామాజిక సేవకుడు, ఆర్ బి ఓ ఎల్  సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిఎస్సార్ కుటుంబ సభ్యులు  ఎంపీని ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా ఆతిథ్యం అందించారు, అనంతరం తాండూరు ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక విస్తరణ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.