schedule Wednesday, September 02, 2026

బీజేపీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం  :- బిజేపి సీనియర్ నాయకుడు కరణం ప్రహ్లద్ రావు

calendar_today September 1, 2026
person Prajagalam News
బీజేపీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం   :-  బిజేపి సీనియర్ నాయకుడు కరణం ప్రహ్లద్ రావు
కుల్కచర్ల :-   రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, బిజేపీ కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బిజేపీ సీనియర్ నాయకుడు కరణం ప్రహ్లద్ రావు మండిపడ్డారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని బిజేపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యాలయంపై, నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై జరిగిన ఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య, ఘణాపూర్ వెంకటయ్య గౌడ్, డాక్టర్ జానకిరామ్, గాదె మహిపాల్, సౌమ్యారెడ్డి, బ్యాగారి శ్రీనివాస్, గడుసు మహిపాల్, సురేందర్ గౌడ్, బిజ్జారం రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు