కాంగ్రెస్ 100 రోజుల హామీలు ఎక్కడ?
September 2, 2026
Prajagalam News
⇒చైతన్య కిరణ్ మల్కాపురం
- Vikarabad -:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని బీఆర్‌ఎస్ నాయకులు చైతన్య కిరణ్ మల్కాపురం విమర్శించారు.
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చైతన్య కిరణ్ మల్కాపురం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి అధికారం అప్పగించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం… ఇప్పుడు 1000 రోజులు దాటినా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోతోంది. ఇక మాటలు కాదు, హామీల అమలు కావాలి” అని చైతన్య కిరణ్ మల్కాపురం అన్నారు. ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ ఎప్పటికీ రాజీపడదని, కేటీఆర్ నాయకత్వంలో ప్రజల తరఫున నిరంతరం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.