schedule Thursday, September 03, 2026

కరెంట్ షాక్ వ్యక్తి మృతి,భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు ఎస్.ఐ కే.విఠల్

calendar_today July 17, 2026
person Prajagalam News
కరెంట్ షాక్ వ్యక్తి మృతి,భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు ఎస్.ఐ కే.విఠల్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో బాబు నాయక్ తండా లో గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల సమయంలో జార్పులా రాములు నాయక్ (51) బాబు నాయక్ తండాలో పొలానికి నీరు పెట్టేందుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ను కరెంట్ రవడం లేదు అని పరిశీలిస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్.ఐ కే.విఠల్ తెలిపారు.భార్య సుశీల బాయి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ కే.విఠల్ తెలిపారు.