ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
calendar_today
July 16, 2026
person
Prajagalam News
• చిలకవాగు కు 30 కోట్లు మంజూరు చేయాలని వినతి
• విద్యుత్ సబ్ స్టేషన్ల టెండర్ ప్రక్రియ వేగవంతం చేయండి
• శాసనసభ్యులు మనోహర్ రెడ్డి
( తాండూర్ )
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క ని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాండూర్ మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న చిలుకవాగు ప్రాజెక్టుకు అదనంగా రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత జీవోను త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే మంజూరైన ఆరు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి, పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ని కోరారు.ఎమ్మెల్యే ప్రతిపాదనల పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చిలుకవాగు ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు నిధుల విడుదలకు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.