పేదింటి ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం అండ
July 13, 2026
Prajagalam News
• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
• కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ
(తాండూర్)
పేదింటి ఆడబిడ్డల వివాహానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 67 మంది లబ్ధిదారులకు రూ.67,07,772 విలువ గల కల్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాల ప్రయోజనం అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి నిరుపేదకూ పారదర్శకంగా అందించేలా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, సర్ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి , మండలాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు మరియు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.