ఓటర్లు సర్ ఫామ్స్ ను నింపేందుకు తెలియక సందేహాలతో ఇంకా గడువుందిలే అని ఇంట్లోనే సర్ పత్రాలను పెట్టుకుంటున్నారని వారి కోసమే సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని తాండూర్ ఆర్డీవో అనిత పేర్కొన్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఫామ్స్ నింపడానికి రాని వారికి కోసం సర్ హెల్ప్ డెస్క్ లలో బిఎల్ఓ లు సహకరిస్తారని అన్నారు. ఆదివారం సెలవు దినం కాబట్టి ఓటర్లు పెద్ద ఎత్తున సర్ పత్రాలను బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు. గడువు సమీపిస్తుండడంతో ఓటర్లు వేగవంతం చేయాలని కోరారు.గడువుందిలే అనే కారణంతో నిర్లక్ష్యం చేయరాదని ఓటర్లు సహకరించి సర్ ప్రక్రియను 14వ తేదీ లోపు ఓటర్లందరూ సహకరించి బిఎల్ఓ లకు పత్రాలను అందించాలని 14వ తేదీ తర్వాత ఎఎస్డి లిస్టు తయారు చేయడం, రెటీనాలైజేషన్( rationalisation) ప్రక్రియ చేపడుతామని పేర్కొన్నారు. 14వ తేదీ తర్వాత ఆన్లైన్ ప్రక్రియ కూడా జరుగుతుంది కాబట్టి ఓటర్లందరూ సహకరించి 14వ తేదీ లోపే బిఎల్ఓ లకు పత్రాలను అందించాలని కోరారు.