schedule Thursday, September 03, 2026

పరిగిలో ఘనంగా ఈద్ వేడుకలు

calendar_today March 21, 2026
person Prajagalam News
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే టిఆర్ఆర్ పరిగి:రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలసి ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే టిఆర్ఆర్ వారిని ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సౌహార్దత,సోదరభావం పెంపొందాలని, అందరూ శాంతి సుఖాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు, ముస్లీం సోదరులు పాల్గొన్నారు.