(తాండూర్)
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నేర్పుతామని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఇంద్రానగర్‌కు చెందిన యువ నాయకులు షేక్ ఖాసీం అలీ, షేక్ పాషాతో పాటు పలువురు స్థానిక నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీలో చేరిన నాయకులకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తూ, కొత్త పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కుటుంబ సభ్యుల మాదిరిగా సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.అలాగే మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.గతంలోనూ కాంగ్రెస్ పార్టీ హయంలోని తాండూర్ అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ పార్టీకి తాండూర్ కంచుకోట అని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా గెలిచిన రెండు సంవత్సరాలలో దశల వారిగా తాండూర్ ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని అన్నారు. టిఆర్ఎస్ అయంలో కనీసం పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిన పాపన్న పోలేదని ప్రజాపాలనలో ప్రజలందరికీ రేషన్ కార్డులు అందించామని సంపన్నులు తినే విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత ప్రజా ప్రభుత్వాన్ని దేనిని అన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి సరైన సమయంలో గుర్తింపునిస్తామని పేర్కొన్నారు. అనంతరం పార్టీలో చేరిన షేక్ ఖాసిం మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్చే లో చేరినట్లు పేర్కొన్నారు. ఇంద్రానగర్ లో మనో రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సిములు, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు అఖిల్ బాబా, లియాకత్ అలీ, పటేల్ కిష్టప్ప, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, పలువురు సీనియర్ నాయకులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.