schedule Thursday, September 03, 2026

ఎస్ఐఆర్ ఓటరు జాబితా కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్డిఓ కె.అనిత 

calendar_today July 2, 2026
person Prajagalam News
ఎస్ఐఆర్ ఓటరు జాబితా కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్డిఓ కె.అనిత 

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కాశీంపూర్ గ్రామంలో కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాని తాండూరు ఆర్డీవో కె.అనిత గురువారం నాడు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా బషీరాబాద్ తాహాశీల్దార్ కార్యాలయనికి చేరుకొని ఎస్ఐఆర్ కార్యక్రమం గురించి రెవిన్యూ అధికారులతో చర్చించడం జరిగింది.జూన్ 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుంది.ఓటరు జాబితాలో పేరు నమోదు,మరణించిన వారి పేర్ల తొలగింపు,చిరునామా మార్పులు తదితర అంశాలపై తాహాశీల్దార్ షాహిదా బేగం తో చర్చించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహాశీల్దార్ రుక్సానా బేగం,ఆర్.ఐ నాగార్జున రెడ్డి,బిఎల్ఓ,రెవెన్యూ సిబ్బంది,తదితరులు ఉన్నారు.