ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాలు ప్రారంభం
June 30, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (నవాంద్గి) పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సహకార వారోత్సవాల సభ కార్యక్రమం ప్రారంభించి పిఎసిఎస్ చైర్మన్ మాట్లాడుతూ సహకార ఉద్యమం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.రైతులు,మహిళా సంఘాలు,యువకులు సహకార సంఘాల్లో చురుగ్గా పాల్గొనాలి,అని పిలుపునిచ్చారు.
జూన్ 29 నుండి జూలై 6 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో వ్యవసాయ రుణాలు,పాడి, మత్స్య,గోదాము సదుపాయాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఈవో వెంకటయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి,డైరెక్టర్లు అశోక్ గౌతమ్,శ్రీనివాస్ రెడ్డి,గోపాల్, స్థానిక రైతులు,సభ్యులు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.