schedule Friday, September 04, 2026

మార్వాడి యువమంచ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

calendar_today March 20, 2026
person Prajagalam News
    తాండూరు: మార్వాడి యువమంచ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పట్టణంలోని శ్రీ బాలాజీ ఆలయంలో జరిగింది. నూతన అద్యక్షులుగా యువ కిషన్ గోపాల్ రాధి, కార్యదర్శి యువ కరణ్ జైన్, కోశాధికారి భరత్ దేవ్డా, ఉపాధ్యక్షులు రోహిత్ అగర్వాల్, అరుణ్ సార్డా, మధు సోనీ, జాయింట్ సెక్రటరీ సునిల్ సార్డా, నిహార సోమని, కిషన్ బూబ్, దినేష్ పర్థాని,కార్యవర్గ సభ్యులుగా నితిన్ సోమాని అనిల్ సార్డా, బ్రిజ్మోహన్ బూబ్, సన్నీ అగర్వాల్, లక్ష్మీనారాయన బూబ్,ఆశిష్ సార్డా, రమాకాంత్ పండిట్, సంజయ్ సార్డా, నిఖిల్ గాగ్రాణి, రోహిత్ సోనీ,దీపక్ బూబ్, అభిషేక్ సార్డా, అభిలాష్ పండిట్ , గిరిధర్ పార్టీని, నితిన్ సార్డా, అభిషేక్ అగర్వాల్ ప్రమాణ స్వీకారం చేశారు. మంచ్ మాజీ అధ్యక్షులు రామనారాయణ బూబ్ సభ్యులచే పదవీ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మార్వాడి సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. యువమంచ్ ఆధ్వర్యంలో రెండు చలి వేంద్రాలు: ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉగాది పండుగ సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్ దగ్గర, మరియు రైల్వే స్టేషన్ లో మినరల్ వాటర్ చలి వేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాజ అద్యక్షులు మురళీధర్ గాగ్ రాణి, రాజస్థానీ నవ యువక సంగ్ అధ్యక్షుడు మన్మోహన్ సార్డా, మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా, మంచ్ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ అగర్వాల్, సమాజ పెద్దలు, మహిళ మండలి సభ్యులు, మంచ్ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.