schedule Wednesday, September 02, 2026

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి:-ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today May 4, 2026
person Prajagalam News
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి:-ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

(కుల్కచర్ల) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య ముదిరాజ్,వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి,ఏఎంసి డైరెక్టర్లు,స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతాంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన మాటను అనుసరించి రైతు పండించిన ప్రతి గింజను కొంటమన్నారు. రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు టి. రాంచంద్రయ్య, నాగని ఎల్లయ్య, భరత్ కుమార్ రెడ్డి, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు