schedule Thursday, May 21, 2026

దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దొరశెట్టి శాంత్ కుమార్

calendar_today May 3, 2026
person Prajagalam News
దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దొరశెట్టి శాంత్ కుమార్

వికారాబాద్ జిల్లా దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దొరశెట్టి శాంత్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పరిగి అసెంబ్లీ నియోజక వర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షుల నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులను జారీ చేసింది.it నేపథ్యంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దొరశెట్టి శాంత్ కుమార్ ను నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ...తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.