ఎంబిబిఎస్ సీటు సాధించిన దీక్షిత రెడ్డికి ఆర్థిక సహాయం
November 3, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో గంగారం గ్రామానికి చెందిన స్వప్న భీమ్ రెడ్డి కూతురు దీక్షిత రెడ్డి నీట్ లో 449 మార్క్ లు సాధించి,నిర్మల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో ఎంబిబిఎస్ పొందినందుకు గ్రామ సర్పంచ్ పి.సునీత రంగారెడ్డి 20000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ పీ.సునీత రంగారెడ్డి,మాజీ ఎంపీటీసీ నాగేంద్రయ్య శాలువతో సన్మానం చేయడం జరిగింది.స్వప్న భీమ్ రెడ్డి కూతురు దీక్షిత రెడ్డి,గ్రామ సర్పంచ్ కు మాజీ ఎంపిటిసి కి కృతజ్ఞత తెలిపారు.