schedule Thursday, May 21, 2026

నేడు పూడూరు మండలంలో పరిగి ఎమ్మెల్యే టిఆర్ఆర్ పర్యటన షెడ్యూల్

calendar_today March 20, 2026
person Prajagalam News
  1. నేడు పూడూరు మండలంలో పరిగి ఎమ్మెల్యే టిఆర్ఆర్ పర్యటన షెడ్యూల్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలంలోని పలు ఆలయాల్లో ఆలయ కమిటీ ప్రమాణస్వీకార కార్యాక్రమాల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గోనడం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వడిబియ్యం కార్యక్రమంలో, పూడూరు మండలం దామగుండం దేవాలయ కమిటీ,రాకంచర్ల దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగం నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.