ఉపాధి హామీలో అవకతవకలు లేకుండా చూడాలి :- పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజయ్య,ఉప సర్పంచ్ లాల్ బహదూర్ శాస్త్రి
calendar_today
April 25, 2026
person
Prajagalam News
(కుల్కచర్ల)
ఉపాధి హామీలో అవకతవకలకు తావులేకుండా పనులు చేయించాలని పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజయ్య,ఉప సర్పంచ్ లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నిబంధనల ప్రకారం కొలతలు చూపించి కూలీలతో పనులు సక్రమంగా చేయించాలని అన్నారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం బయోమెట్రిక్ హాజరు తప్పకుండా తీసుకోవాలని, వేసవి తీవ్రతాను దృష్టిలో పెట్టుకొని ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. తరచుగా నీళ్లు తాగాలని సూచించారు. ఈ కార్యక్రమములో పంచాయతీ కార్యదర్శి కవిత, ఫీల్డ్ అసిస్టెంట్ రఘు రాములు, గ్రామ పెద్దలు ఉప్పరి వెంకటయ్య, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.