schedule Wednesday, September 02, 2026

సర్వే నంబర్ 130 ప్రభుత్వ స్థలమే.. కౌన్సిలర్ ఇర్షాద్

calendar_today April 18, 2026
person Prajagalam News
సర్వే నంబర్ 130 ప్రభుత్వ స్థలమే.. కౌన్సిలర్ ఇర్షాద్
(తాండూర్) మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 130 ప్రభుత్వ స్థలమేనని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఇర్షాద్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై బి.ఆర్.ఎస్   కౌన్సిలర్ ఇర్షాద్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ సవాల్ విసిరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 130లో ఉన్న భూమి నిస్సందేహంగా ప్రభుత్వ భూమి అన్నారు.కొంతమంది ప్రభావశీలులు చట్టాలను తమ కాళ్ల కింద పెట్టుకుని, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అక్రమంగా ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది కేవలం ఆక్రమణ కాదు… ప్రజల ఆస్తిని దోచుకోవడమే” అని మండిపడ్డారు.దమ్ముంటే ఆ భూమి పట్ట భూమి అని రికార్డులతో సహా నిరూపించండి. మేము మాత్రం పక్కా ఆధారాలతో ఇది ప్రభుత్వ భూమి అని నిరూపిస్తామని  సవాల్ చేశారు.ఈ భూమి ప్రభుత్వ భూమి అని నిరూపించే అన్ని సంబంధిత డాక్యుమెంట్స్ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కి అధికారికంగా అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై పిడి యాక్ట్  నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వ భూములను కాపాడడం  మా బాధ్యత  అని తాండూర్ పట్టణంలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని అన్నారు. అక్రమాలకు ముగింపు పలికే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.