schedule Thursday, May 21, 2026

జాతర ఉత్సవాలను దిగ్విజయం చేసిన అందరికీ ధన్యవాదాలు... అధ్యక్షులు మేడి మహేష్

calendar_today April 15, 2026
person Prajagalam News

•సహకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు

•అన్ని శాఖల సహకారంతో జాతర ఉత్సవాలు ఉత్సవాలు విజయవంతం

 • భజన మండలి కీర్తనతో వైభవంగా పల్లకి సేవ కార్యక్రమాలు

(తాండూర్) శ్రీ బావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి  ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులు మేడి మహేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ బావికి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు ఉగాది పర్వదినాన రథ చక్రాలకు అంకురార్పణతో ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా జాతర ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరా తీసి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా ఆహ్వానం మేరకు రథోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలను తమ కుటుంబంలోని పండుగల భావించి సహకరించిన వీరశైవ సమాజ సంఘ పెద్దలు, యువదళ్ సభ్యులు, మహిళా మండలి సభ్యులు, భజన మండలి సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఐదు రోజుల్లో పాటు స్వామివారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రజలమండలి సభ్యుల సహకారం ఎనలేనిదని అన్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు సహకరించిన ఆర్డిఓకి, , రెవిన్యూ వ్యవసాయ వైద్యశాఖలకు  ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా జాతర ఉత్సవాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు మేడి మహేష్ ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో వీరశైవ  సమాజ సభ్యులు లింగదల్లి రవికుమార్, ఫెస్టివల్ కమిటీ సభ్యులు గంగా శ్రావణ్ కుమార్, గాజుల విజయ్ కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రకాంత్, మాద్రికి చంద్రకాంత్, కోర్వార్ అంజలి,అగ్గనూరు సంకేత్, నాయకులు కోరవార్ నగేష్ పాల్గొన్నారు.