schedule Thursday, September 03, 2026

ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి 8సంవత్సరాలుగా చేయుత అందిస్తున్న సర్పంచ్ శాంతి తుల్సిరాం నాయక్

calendar_today April 11, 2026
person Prajagalam News
ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి 8సంవత్సరాలుగా చేయుత అందిస్తున్న సర్పంచ్ శాంతి తుల్సిరాం నాయక్
వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల)
గత ఏనిమిదేళ్ళుగా శాంతి కానుక పేరుతో తమ పంచాయతీ పరిధిలోని గిరిజన తండాలలో ఉన్న ఆడపడుచుల వివాహాలకి అండగా నిలిచి తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని పటేల్ చెరువు తండా సర్పంచ్ శాంతి తుల్సీరాం నాయక్ అన్నారు.శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని పటేల్ చెరువు తండా గ్రామపంచాయతీకి చెందిన జరుప్లా రమణీబాయి, బాబ్యా నాయక్ దంపతుల కూతురు సానిక వివాహానికి బియ్యం, వంట సామాగ్రి, వాటర్ బాటిల్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్,వార్డు సభ్యులు,జిపి వర్కర్స్ దశరత్,రాము వెంకట్, డీలర్ సురేందర్, తండావాసులు పాల్గొన్నారు