schedule Thursday, May 21, 2026

మహిళా హక్కులు,విద్యా కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే

calendar_today April 11, 2026
person Prajagalam News
మహిళా హక్కులు,విద్యా కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే
(కుల్కచర్ల) అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, మహిళల హక్కులు,విద్యా అవకాశాలు కల్పించడం కోసం పనిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ముజాహిద్ పూర్ సర్పంచ్ చంద్రభూపాల్,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు.శనివారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మహాత్మా జ్యోతి రావ్ ఫూలే చేసిన సేవలు,త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,పెంటయ్య, రాములు,షర్పోద్దీన్, భాస్కర్,సోమలింగం, వెంకటేష్,ఆనందం, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు