schedule Friday, September 04, 2026

బూర్గుపల్లిలో ఘనంగా 78వ ఉర్సు ఉత్సవాలు

calendar_today April 3, 2026
person Prajagalam News
బూర్గుపల్లిలో ఘనంగా 78వ ఉర్సు ఉత్సవాలు
 
  1. దర్గా పీఠాధిపతి నూరుద్దీన్ చిప్తి మిర్జాయి ఖలందర్ కిద్మత్ గుజార్
వికారాబాద్ జిల్లా:- వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూర్గుపల్లిలో (ఖుతుబ్-ఏ-జమాన్ దర్గా హజ్రత్ ఖాజా సయ్యద్ మహమ్మద్ గులాం రసూల్ నాయబ్ సహబ్ ఖిబ్లా చీప్తి ఖలందర్ మిర్జాయి షాహిద్-ఏ-నాజ్)దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దర్గా పీఠాధిపతి నూరుద్దీన్ చిప్తి మిర్జాయి ఖలందర్ కిద్మత్ గుజార్,దర్గా ప్రెసిడెంట్ పిర్జాదే మొహ్మద్ రజియుద్దీన్ చీప్తి మిర్జాయి ఖలందరి అన్నారు.శుక్రవారం నుంచి ఆదివారం వారం వరకు దర్గా ఉత్సవాలు జరుగనున్నాయి.ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ...శుక్రవారం సాయంత్రం గంధం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతుందని,శనివారం దీపారాధన అలాగే భజన కార్యక్రమం ఉంటుందని ముగింపు ఆదివారం రోజు ఖత్మ ఖురాన్,భజన కార్యక్రమం ఉంటుందన్నారు.అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు.ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.