schedule Wednesday, September 02, 2026

ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాలలో వెలుగు

calendar_today April 3, 2026
person Prajagalam News
ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాలలో వెలుగు
బషీరాబాద్: బషీరాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో గురు వారం నాడు గ్రామ సభ స్పెషల్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, ఎంపీడీవో సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని,ప్రజల జీవితాలలో వెలుగు నింపాలని,ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మండల పరిధిలో వివిధ గ్రామలలో గ్రామ సభలు నిర్వహించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్,జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు జానకి,ఏపిఎం పద్మారావు,ఉపసర్పంచ్ అబ్దుల్ రజాక్,మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్,మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,గ్రామ వార్డు సభ్యులు రాము నాయక్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.