schedule Wednesday, September 02, 2026

రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చూడాలి  వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి రాజా రత్నం 

calendar_today April 1, 2026
person Prajagalam News
రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చూడాలి    వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి రాజా రత్నం 
వికారాబాద్ (కుల్కచర్ల)
రైతులకి యూరియా అందుబాటులో ఉండేలా చూడాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి రాజా రత్నం ఆదేశించారు.బుధవారంకుల్కచర్ల మండల కేంద్రంలో ఎరువుల డీలర్ల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులకు సంబంధించిన రికార్డులను ,బిల్లు బుక్కలను పరిశీలించి, యూరియా నిల్వలను తనిఖీ చేశారు. యూరియా ను యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మాలని, ఇందుకు గాను రైతులకి విస్తృతంగా అవగాహన కల్పించాలని షాపుల యజమానులను, అధికారులను ఆదేశించారు.రాబోయే వానకాలానికి సంబంధించిన విత్తనాలను సిద్ధం చేసుకొని నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని సూచించారు. వరి లో ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తున్న కారణంగా సన్న రకాలైన వరి విత్తనాలు రైతులకి అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి వీరా స్వామి, వ్యవసాయ విస్తరణ అధికారి బాబు పాల్గొన్నారు