schedule Friday, September 04, 2026

దేవాలయ అభివృద్ధికి దోహదపడి   మంచి పేరు తెచ్చుకోవాలి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

calendar_today April 1, 2026
person Prajagalam News
దేవాలయ అభివృద్ధికి దోహదపడి    మంచి పేరు తెచ్చుకోవాలి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 
  కొలువు దీరిన దేవాలయ నూతన పాలకవర్గం   తాండూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని తాండూర్ ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి అన్నారు.తాండూర్ మండలం కొత్లాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన నూతన చైర్మన్ పట్లోళ్ళ ప్రవీణ్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.ఆలయంలో అన్ని మౌళిక సదుపాయాలు చేసుకున్నామని అన్నారు. తెలంగాణ కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని పేర్కొన్నారు.ఎల్లమ్మ దేవాలయంను ప్రభుత్వ వెబ్ సైట్ లో చేర్చేటట్లు ప్రయత్నం చేస్తానని అన్నారు.ఆలయ చైర్మన్ కు 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని ఆలయ అభివృద్ధికి దోహదపడి, మంచిపేరు తెచ్చుకోవాలని చైర్మన్ కు మరియు పాలకమండలికి సూచించారు. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలను (జుంటుపల్లి, బద్రప్ప దేవాలయం, ఏకాంబరి, పోట్లి మహారాజ్) అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.ముస్లిం సోదరులకు మసీదులు, కబ్రస్తాన్, ఈద్గా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు చర్చిలను అభివృద్ధి చేస్తున్నామని అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రకళ, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు వడ్డే శ్రీను, బాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నాగప్ప, నాయకులు సాయిలు, నవీన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.