schedule Wednesday, September 02, 2026

పరిగి మున్సిపల్ అభివృద్ధే లక్ష్యం మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి

calendar_today April 1, 2026
person Prajagalam News
) వికారాబాద్(పరిగి) వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పట్టణంలో మౌలిక వసతుల లపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నాట్లు తెలిపారు,ముఖ్యంగా రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి సమస్యలను అత్యంత ప్రధానంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు,అన్ని వార్డులకు సమానంగా నిధులు సమాకూర్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.పరిగి మున్సిపాలిటీని అన్ని హంగులతో నిర్మించి ఉన్నత మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు, మెరుగైన సేవలు అందించాలంటే, మున్సిపల్ పరిధి లోని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఎమ్మెల్యే సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల రజిత వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, వైస్ చైర్మన్ హనుమంతు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.