schedule Thursday, May 21, 2026

అందరికీ ఆదర్శం శ్రీరామచంద్రమూర్తి జీవితం... బుయ్యని శ్రీనివాస్ రెడ్డి 

calendar_today March 27, 2026
person Prajagalam News
శ్రీరామనవమి వేడుకలలో  పాల్గొన్న శ్రీనన్న తాండూర్.: హిందువుల పెద్ద పండుగ శ్రీరామనవమిని పురస్కరించుకొని తాండూర్ పట్టణంలోని శ్రీరామ మందిరాలు, హనుమాన్ దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ బి ఓ ఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శీనన్న మాట్లాడుతూ కోదండ రాముడు సీతమ్మల వివాహం జరిగిన రోజు శ్రీరామనవమి అని అన్నారు. మనిషిగా పుట్టిన వ్యక్తి జీవితంలో ఎలా ఉండాలో ఆనాడే శ్రీరామచంద్రమూర్తి మనకు చూపించారని ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్క హిందువు నడవాలని పిలుపునిచ్చారు.