schedule Tuesday, November 03, 2026

రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు పంపిణీ 

calendar_today October 13, 2026
person Prajagalam News
రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు పంపిణీ 
  కుల్కచర్ల   రైతుల పెట్టుబడి భారం తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బోలుసని భీంరెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు తెలిపారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతువేధికలో తెలంగాణ ప్రభుత్వం–వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రబీ 2026–27 సీజన్‌కు 100 శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓలు భావన, కాంగ్రేస్ పార్టీ మండలఅధ్యక్షుడు గోపాల్ నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు వెంకటయ్య, సత్యమ్మ,వెంకటేష్, తిరుపతయ్య,రవీందర్ నాయక్,రైతులు తదితరులు పాల్గొన్నారు