schedule Tuesday, November 03, 2026

లాల్ సింగ్ తండాలో విషాదం -విద్యుత్ షాక్ తో రైతు మృతి

calendar_today October 9, 2026
person Prajagalam News
లాల్ సింగ్ తండాలో విషాదం -విద్యుత్ షాక్ తో రైతు మృతి
కుల్కచర్ల
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో శుక్రవారం  విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ తండ్రి లక్ష్మణ్ నాయక్ తన వ్యవసాయ పొలానికి నీరు పారించేందుకు వెళ్లి బోరు మోటార్ స్టార్ట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో లాల్ సింగ్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మండల ప్రజాప్రతినిధులు,  నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.