schedule Wednesday, September 02, 2026

చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య

calendar_today March 25, 2026
person Prajagalam News
చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య
కుల్కచర్ల మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం 3 ను గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య ఆకస్మికంగా సందర్శించారు.చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అంగన్వాడి టీచర్ అనసూయ కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తలారి విజయ్ కుమార్, మాజీ వార్డు సభ్యుడు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్ ముదిరాజ్ పాల్గొన్నారు.