ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: పీరంపల్లి సర్పంచ్ గడ్డం వెంకటయ్య
March 24, 2026
Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల)30 సంవత్సరాల పైబడిన వారందరూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పీరంపల్లి సర్పంచ్ గడ్డం వెంకటయ్య పేర్కొన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలం పీరంపల్లి గ్రామ పంచాయతీలో కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల పైబడిన వారికి వైద్య సిబ్బందిచే బీపీ,షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రత్నమ్మ, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ , గ్రామస్థులు నక్క.నర్సింహులు,ఎంపిహెచ్ఎ అరుణ,ఆశా కార్యకర్తలు సత్యమ్మ, పద్మ, స్వరూప అంబుబాయి తదితరులు పాల్గొన్నారు