schedule Wednesday, September 02, 2026

పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు

calendar_today March 24, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల):కుల్కచర్ల మండల పరిధిలోని బండవేల్కిచర్ల పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది జాతరకు సంబంధించి మంగళవారం హుండీని అధికారుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపులో మొత్తం రూ.2,50,468 ఆదాయం వచ్చినట్లు దేవాలయం కార్యనిర్వాహక అధికారి జి. బాలనర్సయ్య, చైర్మన్ మైపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్, గ్రామ సర్పంచ్ శ్రీనయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, దేవాలయ అర్చకులు దశరథం, పాండు శర్మ, కమిటీ సభ్యులు, శ్రీ సాంబ శివాని సేవ సమితి సభ్యులు, దేవాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.