schedule Wednesday, September 02, 2026

దీప్ల నాయక్ తండాలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం :దీప్ల నాయక్ తండా సర్పంచ్ అంజలి భరత్ నాయక్

calendar_today March 24, 2026
person Prajagalam News
గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని దీప్ల నాయక్ తండా సర్పంచ్ అంజలి భరత్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కుల్కచర్ల మండల పరిధిలోని దీప్ల నాయక్ తండాలో గ్రామాభివృద్ధి దిశగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామంలో రోడ్డు సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అర్షద్, ఉప సర్పంచ్ బుడమ్మ, వార్డు సభ్యులు సోనీ బాయి, గోపాల్, రాములు, బుడియ్య తదితరులు పాల్గొన్నారు.