schedule Wednesday, September 02, 2026

ఎల్ నినో ప్రభావం ఆలస్యంగా వరి నాట్లు,అధిక ధరలతో మండుతున్న ఎరువులు,ఈ సంవత్సరం ప్రభుత్వం వరి పంటకు క్వింటాలుకు 3,200 రూపాయలు పెంచాలి

calendar_today August 30, 2026
person Prajagalam News
ఎల్ నినో ప్రభావం ఆలస్యంగా వరి నాట్లు,అధిక ధరలతో మండుతున్న ఎరువులు,ఈ సంవత్సరం ప్రభుత్వం వరి పంటకు క్వింటాలుకు 3,200 రూపాయలు పెంచాలి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో అల్లాపూర్ (బి) గ్రామంలో ఎల్ నినో ప్రభావం వల్లన రైతుల పొలంలో ఆలస్యంగా వరి నాట్లు వేస్తున్న కూలీలు,రైతు ప్రతి సంవత్సరం నాల్గు ఎకరాలు వరి సాగు చేసేవారు.ఈ సంవత్సరం రైతు ఎల్ నినో ప్రభావం వలన ఒక్క ఎకరం సాగు చేయడం జరుగుతుంది.వర్షాలు లేక తగ్గిన వరి సాగు,ఎరువులు అధిక ధరలకు అమ్మడంతో,రైతు ఇబ్బంది పడుతున్నారు.రైతు కు ఈ సంవత్సరం వరి పంట క్వింటాలకు ప్రభుత్వం మద్దతు ధర 3,200 రూపాయలు ప్రకటిస్తే రైతుని ఆదుకున్న వారవుతారని తెలిపారు.