schedule Wednesday, September 02, 2026

రైతులు ప్రత్యామ్నాయ పంటలపైపు మొగ్గు చూపాలి, ఫర్టిలైజర్ షాపులలో ఎరువులు,మందులు ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అమ్మాలి,ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి

calendar_today August 25, 2026
person Prajagalam News
రైతులు ప్రత్యామ్నాయ పంటలపైపు మొగ్గు చూపాలి, ఫర్టిలైజర్ షాపులలో ఎరువులు,మందులు ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అమ్మాలి,ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తాండూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు అరుణ,మండల వ్యవసాయ అధికారి అనిత ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు.ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు మందులు అమ్మాలి,ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి,ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తప్పవని అన్నారు.అదేవిధంగా ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించి,తక్కువ నీటితో కంది,మినుము,పెసర పంటలను సాగు చేసేందుకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.కందులు 4కిలోల బ్యాగ్ ధర 400 రూపాయలు, మినుములు 8కిలోల బ్యాగ్ ధర 408 రూపాయలు, పెసర బ్యాగ్ ధర 304 రూపాయలు అవసరమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని విత్తనాల కోసం రైతులు పట్టా పాస్ బుక్,ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు.