కుల్కచర్లలో ఘనంగా ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు
August 20, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బొలుసని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ముందుచూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్టంగా మారిందని, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్, యువతకు 18ఏండ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్నవే అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పర్మటి.అంజిలయ్య గౌడ్,మాజీ మండల అధ్యక్షుడు పెంటమీది వెంకటయ్య గౌడ్, మండల నాయకులు జోగు వెంకటయ్య గౌడ్, ఆనందం, వివిధ గ్రామాల సర్పంచ్లు తిరుపతయ్య, రవీందర్ పవర్, గడ్డం వెంకటయ్య, సీతారాం నాయక్, సంతోష్ నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.