schedule Wednesday, September 02, 2026

కుల్కచర్లలో వికారాబాద్ డిపిఓ జయసుధ ఆకస్మిక తనిఖీ

calendar_today August 13, 2026
person Prajagalam News
కుల్కచర్లలో వికారాబాద్ డిపిఓ జయసుధ ఆకస్మిక తనిఖీ
   
  • (ప్రజాగళం,కుల్కచర్ల)
  వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయాన్ని గురువారం జిల్లా పంచాయతీ అధికారిణీ జయసుధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పలు రికార్డులను పరిశీలించారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్యలయంలో స్థానిక సర్పంచ్ వార్వాల అంజిలయ్య,ఎంపిఓ భాస్కర్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ శివారులో నిర్మిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్డు నిర్మాణం పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జెల్ల నర్సింహులు,బిజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.