ఖాతాదారులకు మెరుగైన సేవలు.. సునీతకు అవార్డుతో సత్కారం
August 13, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
కుల్కచర్ల మండల కేంద్రంలో పల్లె సమగ్ర సేవా కేంద్రం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న కుల్కచర్ల గ్రామానికి చెందిన తెలుగు సునీతకు ఉత్తమ సేవలకు గాను అవార్డు లభించింది. గురువారం వికారాబాద్ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్, శ్రీనిధి మేనేజర్ చేతుల మీదుగా సునీత అవార్డును అందుకున్నారు.ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సులభంగా అందించడంతో పాటు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించినందుకు సునీతను అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తనకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.