ఘనంగా సుందరి అనిల్ జన్మదిన వేడుకలు
August 13, 2026
Prajagalam News
⇒సుందరి అనిల్ ఎల్లయ్య ట్రస్ట్ ఏర్పాటు
⇒సేవ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం
- వికారాబాద్ జిల్లా-:సుందరి అనిల్ ఎల్లయ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని,ఈ ట్రస్టు ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మర్పల్లి మండల మాజీ అధ్యక్షులు సుందరి అనిల్ తెలిపారు. బుధవారం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు.సుందరి అనిల్ ఎల్లయ్య ట్రస్టు లోగోను ఆవిష్కరించారు.బీఆర్ఎస్ నాయకుల,ప్రజల మధ్య పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా సుందరి అనిల్ మాట్లాడుతూ... మర్పల్లి మండలంలో నేటి వరకు సుందరి అనిల్ పేరుతో సేవ కార్యక్రమాలు జరిగాయని,కానీ ఇప్పటి నుంచి "సుందరి అనిల్ ఎల్లయ్య"ట్రస్టు ను ఏర్పాటు చేసి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ట్రస్టును రిజిస్ట్రేషన్ చేశామని అన్నారు.ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.