schedule Wednesday, September 02, 2026

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోండి  :- కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య,ఎంపిఓ భాస్కర్ గౌడ్

calendar_today August 12, 2026
person Prajagalam News
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోండి  :- కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య,ఎంపిఓ భాస్కర్ గౌడ్
  (ప్రజాగళం,కుల్కచర్ల)   ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య, ఎంపీఓ భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల నుంచి కొత్త పింఛన్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తమ అర్హతకు సంబంధించిన వివరాలను సమర్పించి పింఛన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తలారి విజయ్ కుమార్,బిజేపి జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె.మహిపాల్ ముదిరాజ్, కారోబార్ వెంకటయ్య, గుడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.